ETV Bharat / state

'స్వచ్ఛ గ్రామాలతోనే బంగారు తెలంగాణ' - Makthal Mla chittem ram mohan reddy distribution Tractors to the panchayaths

నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

Makthal Mla chittem ram mohan reddy distribution Tractors to the panchayaths
'స్వచ్ఛగ్రామాలతోనే బంగారు తెలంగాణ'
author img

By

Published : Dec 12, 2019, 7:50 PM IST

పల్లెలు అభివృద్ధి చెందినపుడే... దేశం అభివృద్ధి చెందుతుందని.. అందుకే గ్రామాల అభివృద్ధిపైనే సీఎం కేసీఆర్ ఎక్కువ దృష్టిసారించారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. నేరుగా ఫైనాన్స్ కమిషన్ నిధులతోపాటు రాష్ట్ర నిధులను ప్రతినెలా క్రమం తప్పకుండా మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ మంజూరు చేసి, పారిశుద్ధ్యం మరింత త్వరగా జరిగేలా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.

30రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుపోవాలని సూచించారు. అనంతరం 5 మండలాల పరిధిలోని గ్రామాలకు మంజూరైన 28 ట్రాక్టర్లను ఆయా గ్రామాల సర్పంచులకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, జడ్పీ ఛైర్​పర్సన్ వనజమ్మ, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

'స్వచ్ఛగ్రామాలతోనే బంగారు తెలంగాణ'

ఇదీ చూడండి: గొల్లపూడి జీవితాన్ని మార్చేసిన ఆ సంఘటన

Tg_mbnr_16_12_tracter_panpini_av_TS10092 Contributor : Ravindar reddy Center : Makthal ( ) స్వచ్చగ్రామాలతోనే బంగారు తెలంగాణ - ఎమ్మెల్యే చిట్టెం.. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ మంజూరు.. ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దాలి..కలెక్టర్.. నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీలకు ట్రాక్టర్ ల పంపిణీ చేశారు. పల్లెలు అభివృద్ది చెందినపుడే దేశం అభివృద్ది చెందుతుందని, అందుకే గ్రామాల అభివృద్దిపైనే సీఎం కేసీఆర్ ఎక్కువ దృష్టిసారించి, నేరుగా ఫైనాన్స్ కమిషన్ నిధులతోపాటు రాష్ట్ర నిధులను ప్రతినెలా క్రమం తప్పకుండా అందజేస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెంరామ్మోహన్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనని అభివృద్దిపనులను సీఎం కేసీఆర్ చేపడుతున్నారని అన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ మంజూరు చేసి,పారిశుద్ద్యం మరింత త్వరగా జరిగేలా కృషి చేస్తున్నారని అన్నారు. సర్పంచులతోపాటు గ్రామాలు అభివృద్ది చేసుకునేందుకు నడుం బిగించాలన్నారు. 30రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుపోవాలని సూచించారు. అనంతరం 5 మండలాల పరిధిలోని గ్రామాలకు మంజూరైన 28 ట్రాక్టర్లను ఆయా గ్రామాల సర్పంచులకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, జడ్పీచైర్ పర్సన్ వనజమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ నిజాంపాషా, మార్కెట్ చైర్మన్ నర్సింహాగౌడ్, ఎంపీపీ వనజాదత్తు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు,ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 9959999069,మక్థల్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.