ETV Bharat / state

వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు - నారాయణపేటలో వామపక్ష నేతల ధర్నా

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నారాయణపేట జిల్లాలోని పలు చోట్ల ధర్నాలు చేశారు.

వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు

author img

By

Published : Sep 25, 2020, 6:05 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని వామపక్షనేతలు ఆరోపించారు. నారాయణ పేట జిల్లాలో పలు చోట్ల కాంగ్రెస్​ నాయకులతో కలిసి నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో వామపక్ష పార్టీల కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. మక్తల్ నియోజకవర్గం తహసీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడం వల్ల ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

ఇదీ చూడండి: ఆ వివాదాన్ని డీఆర్టీలోనే తేల్చుకోవాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.