నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో కార్యాలయానికి సంబంధించి 11 మండలాల ఈ-కార్యాలయాలను జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఆన్లైన్లో హైదరాబాద్ నుంచి ప్రారంభించారు.
నారాయణపేట జిల్లాకు సంబంధించిన అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాలు
కాగితపు రహితంగా.. ఈ-కార్యాలయాల ద్వారా కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరును కలెక్టర్ ఆన్లైన్లో జయేశ్రంజన్కు వివరించారు.
ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత