నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామ స్టేజీ 167వ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నెలల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే వేచి చూస్తున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
అన్నదాతల ఆందోళన గురించి తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ షెహరాజ్ అహ్మద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతల సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన... అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులు పండించిన చివరి ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేస్తామని షెహరాజ్ అహ్మద్ హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
ఇదీ చూడండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ