IT Raids in Telangana Today : రాష్ట్రంలో పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న వేళ.. ఐటీ (IT Raids in Telangana), ఈడీ, ఎన్నికల బృందాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా తాజాగా నారాయణపేట జిల్లాలో ఆదాయపన్ను శాఖ అధికారులు తెల్లవారుజాము నుంచే.. బీఆర్ఎస్ నేతల ఇండ్లపై దాడులు నిర్వహిస్తున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు.. డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.
అదేవిధంగా నారాయణపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ హరినారాయణ భట్టాడ్, ప్రముఖ వ్యాపార బన్సీలాల్ లాహోటి నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. వ్యాపార, బ్యాంకు, ఇతర లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. వారి వారి కుటుంబ సభ్యులను.. ఆదాయపన్ను శాఖ అధికారులు విచారిస్తున్నారు.
IT Raids in Hyderabad : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో మూడో రోజూ ఐటీ సోదాలు
Election Team Raids on EX MLA Sampath Kumar : మరోవైపు గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ (EX MLA Sampath Kumar) ఇంట్లో.. ఎన్నికల బృందం తనిఖీలు నిర్వహించింది. జిల్లా నోడల్ అధికారి నవీన్ కుమార్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బృందం సోదాలు చేశారు. అప్పుడు సంపత్ అందుబాటులో లేకపోవడంతో.. ఆయన భార్య మహాలక్ష్మిని అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో ఆమె స్పృహ కోల్పోయింది.
దీనిపై సమాచారం అందుకున్న సంపత్ కుమార్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా దాడులు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు.. పోలీసులు, అధికారులతో ఘర్షణకు దిగారు. అయితే ఈ తనిఖీల్లో అధికారులకు.. ఎలాంటి నగదు, ఇతర విలువైన వస్తువులు లభ్యం కాలేదని సమాచారం.
విశాంత్ర ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో భారీ నగదు! - కాంగ్రెస్ ఫిర్యాదుతో అధికారుల తనిఖీలు
Huge Amount Of Cash Seized in Ramagundam : మరోవైపు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో.. ఓ ఇంట్లో దాచి పెట్టిన భారీ నగదును ఎస్‌వోటీ అధికారులు పట్టుకున్నారు. ఇంట్లో నగదు గురించి పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి.. రూ.2.18 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు ఓ కాంట్రాక్టర్‌కు చెందిందని సమాచారం. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం - ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు!