ETV Bharat / state

రేషన్​డీలర్ల ఎంపికలో అవకతవకలు.. అర్హులకు ఇవ్వాలంటూ అభ్యర్థుల గగ్గోలు..

Irregularities in Ration Dealers Selection: నారాయణపేట జిల్లాలో 31 గ్రామాల కోసం చేపట్టిన రేషన్ డీలర్ల నియామక ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. ఎక్కువ మార్కులు వచ్చిన అర్హులైన అభ్యర్థులకు కాకుండా తక్కువ మార్కులు వచ్చిన వారికి డీలర్​షిప్ కట్టబెట్టారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూల పేరుతో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు అనర్హులకు నియామక పత్రాలు ఇచ్చారని విమర్శిస్తున్నారు.

DEALER
DEALER
author img

By

Published : Mar 26, 2023, 12:27 PM IST

నారాయణపేట జిల్లాలో వివాదాస్పదంగా మారిన రేషన్‌ డీలర్ల నియామక ప్రక్రియ

Irregularities in Ration Dealers Selection: నారాయణపేట జిల్లాలో వివిధ మండలాల్లో ఇటీవల చేపట్టిన రేషన్ డీలర్ల నియామక ప్రక్రియలో అనర్హులకు డీలర్ షిప్ కట్టబెట్టారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నారాయణపేట జిల్లాలోని 10 మండలాల్లోని 31 గ్రామాల్లో రిజర్వేషన్ల వారీగా రేషన్ డీలర్ల నియామకాలు చేపట్టారు. అందుకోసం 80 మార్కులు రాత పరీక్షకు, 20 మార్కులు మౌఖిక పరీక్షకు కేటాయించారు. రాత పరీక్షల్లో కనీసం 32 మార్కులు సాధించిన అభ్యర్థులను క్వాలిఫైడ్ అభ్యర్థులుగా ఎంపిక చేసి.. ఒక్కో డీలర్ స్థానానికి అత్యధిక మార్కులు సాధించిన ఐదుగురిని ఇంటర్వ్యూలకు పిలిచారు.

రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూ పేరుతో అధికంగా మార్కులు వేసి.. వారికి నియామక పత్రాలు ఇచ్చారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూలోనూ అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ప్రశ్నలు మాత్రమే వేశారని.. అన్నింటికీ సరైన సమాధానాలిచ్చామని అంటున్నారు. అన్ని అర్హతలు ఉండి, మంచి మార్కులు సాధించినా ఇంటర్వ్యూల్లో మాత్రం తాము నెగ్గలేదని అధికారులు చెబుతున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పాటు అభ్యర్థులతో కుమ్మక్కైన అధికారులు అనర్హులకు డీలర్ షిప్ కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా డీలర్‌షిప్‌ కేటాయింపు: గతంలో డీలర్‌గా పని చేసి సస్పెండైన వ్యక్తుల కుటుంబాలకు మళ్లీ డీలర్ షిప్ అప్పగించకూడదు. కానీ మద్దూరు మండలంలోని ఓ గ్రామంలో డీలర్​గా పని చేసి సస్పెండైన వ్యక్తి కుటుంబ సభ్యురాలికే తిరిగి డీలర్ షిప్ అప్పగించారు. ఆవాస గ్రామాల్లో నివాసముండే వారికి డీలర్ షిప్ ఇవ్వకూడదు. మాగనూరు మండలంలోని గ్రామ పంచాయతీలో అర్హులైన అభ్యర్థులకు ఇవ్వకుండా ఆవాస గ్రామంలోని వారికి డీలర్ షిప్ అప్పగించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు సుమారు 10 గ్రామాల అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.

మరోసారి అధికంగా మార్కులు వచ్చిన అభ్యర్థులను పిలిచి కలెక్టరే నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నారాయణపేట ఆర్డీవో రామచందర్‌ను వివరణ కోరగా.. నిబంధనల మేరకే నియామకాలు చేపట్టామని, ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ఫిర్యాదుల్లో నిజముంటే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి కొన్ని గ్రామాల నుంచి ఫిర్యాదులు అందినా.. దాదాపు అన్ని గ్రామాల్లోనూ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

'మా ఊర్లో మొత్తం 12 మంది డీలర్‌ షిప్‌ నోటిఫికేషన్‌కు అప్లై చేశాం. అందులో 7 మంది క్వాలీఫై అయ్యాం. ఇందులో 5 మంది ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. కానీ జాబ్‌ మాత్రం నాకంటే 7 మార్కులు తక్కువ వచ్చిన వ్యక్తికి ఇచ్చారు. ఏంటని ప్రశ్నిస్తే.. నీకు మంచి నాలెడ్జ్‌ ఉంది గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అవ్వు.. మంచి గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుంది అని సమాధానం చెబుతున్నారు'.- డీలర్‌ షిప్‌ పరీక్ష రాసిన అభ్యర్థి

ఇవీ చదవండి:

'కొత్తరకం కరెంట్‌' షాక్‌ తగలబోతోంది.. ఆ సమయంలో వాడితే ఇక బిల్లుల మోతే..!

దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ కేసు.. రంగంలోకి దిగిన ఆర్మీ

ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు.. ఈసారి ఆరు పేపర్లతోనే ఎగ్జామ్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.