ETV Bharat / state

హరివిల్లు కార్యక్రమంతో అక్షర యజ్ఞానికి శ్రీకారం - Narayapeta news

బడికి వెళ్లేందుకు చిన్నపిల్లలు మారాం చేస్తుంటారు. వారిని తల్లిదండ్రులు బుజ్జగించి, ఒక్కోసారి దండించి పంపుతుంటారు. భయంతో ఇష్టం లేకున్నా తరగతి గదిలో అడుగు పెట్టిన పిల్లలు అక్షరాలపై మాత్రం దృష్టి సారించరు. తనువు తరగతి గదిలో మనసు బయట అన్నట్లు వారి పరిస్థితి ఉంటుంది.

Akshara Yagnam
హరివిల్లు కార్యక్రమం
author img

By

Published : Apr 4, 2021, 10:06 AM IST

బడికి వెళ్లేందుకు చిన్నపిల్లలు మారాం చేస్తుంటారు. వారిని తల్లిదండ్రులు బుజ్జగించి, ఒక్కోసారి దండించి పంపుతుంటారు. భయంతో.. ఇష్టం లేకున్నా తరగతి గదిలో అడుగు పెట్టిన పిల్లలు అక్షరాలపై మాత్రం దృష్టి సారించరు. తనువు తరగతి గదిలో మనసు బయట అన్నట్లు వారి పరిస్థితి ఉంటుంది. ఆశించిన స్థాయిలో పిల్లలు చదువుకోవడం లేదు.

వారి వ్యక్తిత్వ నిర్మాణానికి విలువలున్న బోధన అందించాలని ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో పాఠశాలల్లో విద్యాశాఖ హరివిల్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిపై ఈనెల 6వ తేదీ నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రీసోర్సుపన్లకు ఇంతకుముందే రాష్ట్రస్థాయిలో పూర్తయింది.

హాజరుశాతం పెంచేందుకు..

పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని నూతన కార్యక్రమం చేపట్టనున్నారు. తరగతి గదిలో అభ్యసన ఆనందకరంగా ఉంటే విద్యార్థుల జీవితాలు హరివిల్లుగా మారే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులకు ప్రస్తుతం శిక్షణను పూర్తి చేసి నూతన విద్యాసంవత్సరంలో అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఈ ఏడాది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమయ్యారు. బడుల్లో హాజరు శాతం, ప్రవేశాలు పడిపోకుండా కేంద్ర ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు హరివిల్లు- జాయ్​పుల్‌ లర్నింగ్‌ కార్యక్రమాన్ని విద్యాశాఖ తీసుకొచ్చింది.

పాఠశాలల్లో విద్యార్థులను 1, 2 సెక్షన్లుగా విభజించి మొదటి దాంట్లో 1, 2, రెండో సెక్షన్‌లో 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు బోధన అందించనున్నారు. ప్రతి సోమవారం మానసిక సంసిద్ధత, మంగళ, బుధవారం కథలు చెప్పడం, గురు, శుక్రవారాల్లో 1, 2వ తరగతులకు సమన్వయ కృత్యాలు, 3, 5వ తరగతి పిల్లలకు భావవ్యక్తీకరణ అంశాలపై బోధించనున్నారు. తొలి అరగంట హరివిల్లు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానంపై అవగాహన కల్పించనున్నారు.

* జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఇద్దరు రీసోర్స్‌పర్సన్లను ఎంపిక చేశారు. వారికి ఇప్పటికే రాష్ట్రస్థాయిలో శిక్షణ పూర్తి చేశారు. 6 నుంచి 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం కానుంది. 1,105 మంది ఉపాధ్యాయులు హాజరు కానున్నారు. వారంతా తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. రోజుకు రెండు బ్యాచులు ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు శిక్షణ కొనసాగుతుంది.

విద్యతోపాటు నైతిక విలువలు..

ప్రాథమిక దశలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వారిలో నైతిక స్ఫూర్తిని నింపేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రవేశాల సంఖ్య, హాజరు శాతాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు అభ్యసనం, ఆకట్టుకునేలా ఆటపాటలతో బోధన తరగతుల నిర్వహణపై శిక్షణ ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులు శిక్షణకు విధిగా హాజరు కావాలి.

- రవీందర్‌, డీఈవో

ఇదీ చదవండి: యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. అటువైపే చూడని అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.