నారాయణపేట పట్టణంలో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలను సోమవారం స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు తమ ఎడ్లకు రంగులు అద్ది అందంగా తయారు చేశారు. స్థానిక పండ్ల హనుమాన్ దేవాలయం దగ్గర ఏటా నిర్వహించినట్టుగానే ఈసారి కూడా ఏరువాక పౌర్ణమి నిర్వహించారు.
పండుగ సందర్భంగా పిండి వంటలు చేసుకుని కాడేడ్లకు పూజలు చేశారు. ఉత్సాహంగా ఉండేందుకు నాటుసారా తాగించారు. సాయంత్రం కాడెద్దులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానిక మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇవీ చూడండి : భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంటును పరిశీలించిన దానకిశోర్