ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో భాజపా నేతలు ఆందోళన చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు వీహెచ్ సంఘీభావం