ETV Bharat / state

తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య - crime news

ఓ యువకుడితో చనువుగా ఉంటోందని గమనించిన తల్లిదండ్రులు మందలించడం వల్ల మనస్తాపం చెంది ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నారాయణపేట జిల్లాలోని ఎర్గాట్​పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

girl suicide in narayanapet district
తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య
author img

By

Published : Aug 26, 2020, 7:07 PM IST

తల్లిదండ్రులు మందలించడం వల్ల మనస్తాపం చెంది బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని ఎర్గాట్​పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై రషీద్ కథనం ప్రకారం... ఎర్గాట్​పల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడితో గత కొన్ని నెలలుగా చనువుగా ఉంటుంది.

ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు బాలికను మందలించారు. మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. వెంటనే తండ్రి హుటాహుటిన నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ప్రథమ చికిత్స చేసిన వైద్యులు... మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడకు తరలిస్తుండగా మార్గమధ్యలో బాలిక మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని... గర్భవతిని చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.