నారాయణపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్ వంట గదిలో ఉన్న సిలిండర్ లీకేజీ కావడం వల్ల అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. సిలిండర్ పైప్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వంటగదిలో పెద్ద శబ్దం వచ్చింది. ఆ సమయంలో వసతిగృహంలో విద్యార్థులు లేనందున ప్రమాదం ఏమీ జరగలేదని నిర్వాహకులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా... వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇవీ చూడండి: పులిచింతల వద్ద పర్యటక సందడి