నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా భాజపా నేతలు గాంధీజీ సంకల్ప యాత్రను అట్టహాసంగా ప్రారంభించారు. పట్టణంలోని అన్ని పుర వీధుల గుండా పాదయాత్రగా తరలివెళ్లి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలకు అండగా నిలవాలని కోరారు. మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ శాసనసభ్యులు ఎర్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భారతావనిలో 'నవకశ్మీరం'.. ప్రగతికై మరో పయనం