ధ్యాన్యం నింపేందుకు అధికారులు గోనె సంచులు ఇవ్వడం లేదని నారాయణపేట జిల్లా మాగనూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. పంటను రవాణా చేసేందుకు కూడా తాము ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోందని తెలిపారు. నెల రోజుల నుంచి గోదాముల వద్ద పడిగాపులుకాస్తున్న తమకు కాకుండా దళారులకు గోనె సంచులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ రహదారిపై జరుగుతోన్న ఆందోళనను అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎస్సై శివనాగేశ్వర్ గోనె సంచుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇప్పించడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల