దిశ నిందితుడు చెన్నకేశవులు ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ భార్య రేణుక నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామంలోని జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దేశంలో అత్యాచారం చేసిన వారందరినీ ఎన్‌కౌంటర్ చేయలేదని.. తన భర్తను ఎలా చంపారని ప్రశ్నించింది.
తప్పు చేసిన వాళ్లందరినీ శిక్షించేవరకు పోరాడతానంటూ నినాదాలు చేశారు. పోలీసుల జోక్యం చేసుకుని చెన్నకేశవులు భార్యకు నచ్చజెప్పి పంపించారు.
ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం: కేసీఆర్