ETV Bharat / state

రోడ్డు కోసం రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు - కాంగ్రెస్ కార్యకర్తలు

నారాయణపేట జిల్లాలోని సంగంబండ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.

రోడ్డు కోసం రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు
author img

By

Published : Sep 25, 2019, 4:55 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి దేవాలయం నుంచి పట్టణ శివారు వరకు ర్యాలీ నిర్వహించారు. సంగంబండ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కిలోమీటరు పొడవునా రహదారి అధ్వాన్నంగా మారిందని దానిని తక్షణమే బాగు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ధర్నాతో సుమారు కిలోమీటరు పొడవున ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగప్రవేశం చేసిన పోలీసులు, మున్సిపల్ కమిషనర్ పావని నాయకులకు నచ్చజెప్పి వీలైనంత తొందరగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రోడ్డు కోసం రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు

ఇవీ చూడండి: 'ఎక్కువ మార్కులొచ్చినా.... ఉద్యోగం రాలేదు'

Intro:Tg_mbnr_09_25_Congress_darna_av_TS 10092

అధ్వాన స్థితికి చేరుకున్నా సంగంబండ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు జాతీయ రహదారి 167 నెంబర్ పై ధర్నా.

Body:నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు 167వ జాతీయ రహదారి పై ధర్నా నిర్వహించారు. మక్తల్ పట్టణంలోని స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయం నుండి పట్టణ శివారు వరకు. ఎంతో కీలకమైన ఈ రహదారి పనులు నిలిచిపోవడం పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు,కార్యాలయానికి వెళ్లి అధికారులు, స్థానికులు, తదితరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆలయం నుంచి 1 కిలోమీటరు పొడవునా రహదారి అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే పనులు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో సుమారు కిలో మీటర్ పొడవున ఎక్కడికక్కడే భారీ వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం పోలీసులు, మున్సిపల్ కమిషనర్ పావని నాయకులకు నచ్చజెప్పి వీలైనంత తొందరగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Conclusion:ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి ఆశి రెడ్డి, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ వాకిటి శ్రీహరి , కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

9959999069,మక్థల్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.