నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లి వీఆర్వో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. గ్రామానికి చెందిన వెంకటప్ప అనే రైతు... తాత పొలాన్ని తమ పేర్ల మీద చేయించుకునేందుకు వీఆర్ఓ పద్మనాభంను కలిశాడు. పట్టా చేసివ్వడానికి రూ. 9000 ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్ చేశాడు.
లంచం ఇవ్వటం ఇష్టం లేని రైతు... ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న అనిశా... పథకం ప్రకారం డబ్బులు తీసుకునే సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నేరాన్ని వీఆర్ఓ పద్మనాభం ఒప్పుకోవడంతో నిందితున్ని అరెస్టు చేశారు.