నారాయణపేట జిల్లా చందాపూర్ గ్రామస్థులు శ్మశాన వాటిక స్థలం కోసం మఖ్తల్ వరకు కాలినడకన వెళ్లారు. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఎమ్మార్వో శ్రీనివాసులును కలిసి వివాదాస్పద శ్మశాన వాటిక భూ సమస్యను పరిష్కరించాలని కోరారు. గ్రామానికి చెందిన మల్లెపువ్వు వెంకటయ్య... స్మశానానికి సంబంధించిన భూమిలో 12 గుంటల భూమి తనకు వస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మార్వో వెంటనే గ్రామానికి చేరుకొని సర్వే నిర్వహించి రికార్డుల ప్రకారం ఎకరా 16 గుంటల భూమి శ్మశాన వాటికకు చెందుతుందని వెల్లడించారు. ఈ భూమిలో ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి అధికారం లేదని తేల్చి చెప్పారు. తమ సమస్యలను సత్వరమే పరిష్కరించిన తహసీల్దార్ శ్రీనివాసులుకి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ