ETV Bharat / state

'ఎమ్మెల్యేల కొనుగోలు కొత్తేం కాదు.. బయటపడని వారు ఇంకెందరో..!' - నారాయణపేట జిల్లా తాజా వార్తలు

Bhatti Vikramarka Fires On TRS And BJP: తెరాస, భాజపాలపై భట్టి విక్రమార్క తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం భాజపా, తెరాసకు కొత్త కాదని తెలిపారు. తెరాసలో నలుగురు మాత్రమే బయటపడ్డారు.. బయటకు రాని వాళ్లు ఇంకెందరో అని భట్టి విక్రమార్క ఆరోపించారు.

Bhatti Vikramarka Fires On Trs And BJP
Bhatti Vikramarka Fires On Trs And BJP
author img

By

Published : Oct 27, 2022, 6:43 PM IST

Bhatti Vikramarka Fires On TRS And BJP: భాజపా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని తెరాస అంటోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. తెరాస ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయం అందరికీ తెలుసని గుర్తు చేశారు. భాజపా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయా ప్రభుత్వాలను కూల్చేసిందని ధ్వజమెత్తారు. తెరాస, భాజపా కలిసి ప్రజాస్వామ్యాన్ని జుగుప్సాకరంగా మార్చాయని దుయ్యబట్టారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని చేర్చుకుని తెరాస మంత్రి పదవులు ఇచ్చిందని ఆక్షేపించారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి మాయ చేయాలని చూస్తున్నాయని భట్టి విక్రమార్క మండిపడ్డారు. అధికారం అండతో ప్రభుత్వ యంత్రాంగాలను నాశనం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం భాజపా, తెరాసకు కొత్త కాదని పేర్కొన్నారు. తెరాసలో నలుగురు మాత్రమే బయటపడ్డారు.. బయటకు రాని వాళ్లు ఇంకెందరో అని ఆరోపించారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ అపహాస్యం అవుతుందని గగ్గోలు పెట్టినా.. ఫలితం లేదని పేర్కొన్నారు. మునుగోడులోనూ రెండు పార్టీలు నేతల కొనుగోళ్లకు దిగాయని విమర్శించారు. అందుకే తెరాస, భాజపాకు ప్రజలు బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క కోరారు.

తెరాస, భాజపా ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేస్తున్నాయి: భట్టి విక్రమార్క

"ఏ రాజకీయ పార్టీ మేము చెప్పినప్పుడు ఎవ్వరూ వినలేదు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో జరిగిపోతుంది. తెరాస 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుంది. నలుగురు మాత్రమే బయటపడ్డారు. బయటకు రాని వాళ్లు ఇంకెందరో ఉన్నారు. ఈ రెండు పార్టీలు చేసే పనులు నీచంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనించి తెరాస, భాజపాలకు బుద్ధి చెప్పాలని కోరుతున్నాం." - భట్టి విక్రమార్క సీఎల్పీ నేత

ఇవీ చదవండి: 'ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అమిత్‌ షాతో సుప్రీం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయించాలి'

Bandi on Buy TRS MLAs Issue: 'కేసీఆర్ దమ్ముంటే యాదాద్రికి రా.. ప్రమాణం చేద్దాం'

నలుగురు తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు.. దిల్లీ నుంచి వచ్చిన ముగ్గురి అరెస్ట్

'సైబర్​ నేరాలను సమర్థంగా ఎదుర్కోవడం అన్ని రాష్ట్రాల సమష్టి బాధ్యత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.