నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని ఆరో వార్డు సమీపంలో మొసలి పిల్ల సంచారం కలకలం సృష్టించింది. దీంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
పదేళ్ల క్రితం ఇటుక బట్టీల కోసం తవ్విన గుంతలో మూడు అడుగుల మొసలి పిల్ల పట్టణ వాసులకు కనిపించింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీశాఖ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకోగా... స్థానికులు మెుసలిపిల్లను వారికి అప్పగించారు. అటవీశాఖ అధికారులు దానిని కృష్ణా నదిలో విడిచిపెట్టారు.
ఇవీ చూడండి: కరోనా సేవల్లో.. తెలంగాణ పోలీస్ భేష్