ETV Bharat / state

'కారు' స్టీరింగ్ ఎప్పుడూ మజ్లిస్ చేతిలోనే - కేసీఆర్‌ను ఇక ఇంటికి సాగనంపే టైమొచ్చింది : అమిత్​ షా

Amit Shah Fires on BRS Government : తెలంగాణలో కాంగ్రెస్‌.. బీఆర్ఎస్‌కు బీ టీమ్ వంటిందని అమిత్ షా పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు ఎప్పుడూ తమ వారసుల గురించే ఆలోచిస్తాయని విమర్శించారు. దిల్లీలో రాహుల్‌ను, రాష్ట్రంలో కేటీఆర్‌ను పదవిలో కూర్చోబెట్టాలని చూస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు.

Amit Shah
Amit Shah
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 1:26 PM IST

Updated : Nov 26, 2023, 2:18 PM IST

Amit Shah Fires on BRS Government : ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించేవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలకు అడ్డులేకుండా పోయిందని విమర్శించారు. ప్రజల పనులు చేయకుండా దందాలు చేయడమే బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే విధానమని ధ్వజమెత్తారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.

Amit Shah Speech At Suryapet Jana Garjana Sabha : 'వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యం'

Amit Shah at Makthal BJP Public Meeting : భారతీయ జనతా పార్టీ గెలిస్తే.. మక్తల్‌, నారాయణపేటలో టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేస్తామని అమిత్ షా (Amit Shah) హామీ ఇచ్చారు. మత్స్యకారుల కోసం నిధులు, ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతం అభివృద్ధి చెందలేదని అన్నారు. ప్రభుత్వం అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్‌ను (CM KCR) ఇంటికి సాగనంపే సమయం వచ్చిందని అమిత్ షా వెల్లడించారు.

Amit Shah Fires on Congress : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు అమ్ముడుపోతారని అమిత్ షా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో హస్తం పార్టీ అనేది.. భారత రాష్ట్ర సమితికి బీ టీమ్ వంటిందని చెప్పారు. ఆ రెండు పార్టీలు ఎప్పుడూ తమ వారసుల గురించే ఆలోచిస్తాయని ఆరోపించారు. వారు దిల్లీలో రాహుల్‌ గాంధీని (Rahul Gandhi), తెలంగాణలో కేటీఆర్‌ను (KTR) పదవిలో కూర్చోబెట్టాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ అని అమిత్ షా స్పష్టం చేశారు.

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే ఏడాదికి పేదలకు 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అమిత్ షా తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలా.. వద్దా అని ప్రశ్నించారు. ఎంఐఎం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భయమని అన్నారు. బీఆర్ఎస్‌ కారు స్టీరింగ్ ఎప్పుడూ మజ్లిస్ చేతిలోనే ఉంటుందని ఆరోపించారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరానికి ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ట చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే.. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా రామమందిర దర్శనం కల్పిస్తామని అమిత్ షా వివరించారు.

కారు స్టీరింగ్ ఎప్పుడూ మజ్లిస్ చేతిలోనే

"ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించేవి. కేసీఆర్ పదేళ్ల పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేల భూకబ్జాలకు అడ్డు లేకుండా పోయింది. ప్రజల పనులు చేయకుండా దందాలు చేయడమే బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే విధానం. బీజేపీ గెలిస్తే మక్తల్‌, నారాయణపేటలో టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేస్తాం. మత్స్యకారుల కోసం నిధులు, ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో కృష్ణా పరివాహక ప్రాంతం అభివృద్ధి చెందలేదు. కాళేశ్వరంలో ప్రభుత్వ అవినీతి వల్లే ప్రాజెక్టు కుంగిపోయింది. కేసీఆర్‌ను ఇంటికి సాగనంపే సమయం వచ్చింది." - అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయి : అమిత్‌ షా

బీజేపీ ప్రభుత్వం రాగానే - మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం : అమిత్​ షా

Last Updated : Nov 26, 2023, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.