నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పంచదేవ పహాడ్ శ్రీపాద ఛాయ ఆశ్రమ పీఠాధిపతి చింత శ్రీపతి స్వామీజీ ఆశ్రమంలో ఈ నెల 7 నుంచి నిర్వహిస్తున్న వరుణ యాగం ఇవాళ్టీతో ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత మూడేళ్లుగా వర్షం కురవాలని ప్రతి జూన్, జనవరి మాసాల్లో ఈ యాగాన్ని జరిపిస్తున్నారు. దైవ చింతన తోనే వర్షాలు కురుస్తాయని పురాణ ఇతిహాసాలను పేర్కొనబడిందని స్వామీజీ తెలిపారు. ఈ వరుణయాగంలో చివరి రోజు భక్తులు భారీగా పాల్గొన్నారు.
ఇవీ చూడండి: జగిత్యాల జిల్లాలో సర్కారు బడిని బతికించుకున్నారు