ETV Bharat / state

నల్గొండ జడ్పీ సమావేశం.. ప్రొటోకాల్​పై ఎంపీ కోమటిరెడ్డి అసహనం - nalgonda zilla parishad plenary meeting

తెరాస​ ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి, కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎక్కడ? ఎప్పుడు అనుకుంటున్నారా? ఇంతకీ వారి మధ్య ఎందుకు గొడవ జరిగింది. తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

zilla parishad plenary meeting
జడ్పీ సమావేశం
author img

By

Published : Jul 24, 2021, 9:28 PM IST

తెరాస ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి, కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. నల్గొండ జిల్లాలోని ప్రజాపరిషత్​ సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రొటోకాల్​ ప్రకారం సమావేశం జరగడం లేదని కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేయగా... దీనికి బదులుగా ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి సమాధానమిచ్చారు.

కోమటి రెడ్డి: కొట్లాటలు అవసరం లేదు, ఆర్గ్యూమెంట్​ అవసరం లేదు, ఇప్పుడేెం ఎన్నికలు లేవు... ప్రొటోకాల్​ పాటిస్తే సరిపోతుంది కదా..

భూపాల్​ రెడ్డి: (అధికారులనుద్దేశిస్తూ...) ఏమి ప్రొటోకాల్​ పాటిస్తలేదు మీరు.. వాళ్లకెందుకు ఆ అనుమానం వచ్చింది. (కోమటిరెడ్డిని ఉద్దేశిస్తూ) ఏదోటి రచ్చచేసి పోవాలి. పేపర్లో పడాలని చూస్తున్నారా? ఇందుకే వచ్చారా? కరెక్ట్​ కాదు అది. చూస్తున్నాము. మేము కూడా ప్రొటోకాల్​ పాటిస్తున్నాం. ఈ చిన్నపిల్లలాట, పెద్దపిల్లలాట ఏంటి? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఏం బెదిరిస్తున్నారు. చిన్నపిల్లలాట అనుకుంటున్నారా?

ఉత్తమ్​కుమార్​ రెడ్డి: ఈ విషయం అధికారులకు చెప్పాలి. చిన్నపిల్లలు, పెద్దపిల్లలనే మాటలెందుకు?

కోమటిరెడ్డి: ఛైర్మన్​ గారు.. మిమ్మల్ని, అధికారులను ఉద్దేశించే అన్నాము. ఇది మీటింగ్ దానిని ఉద్దేశించే అన్నాను కానీ ఇంకెవరిని అనలేదు.

జడ్పీ సమావేశంలో పలు సమస్యలపై చర్చించిన అనంతరం ప్రొటోకాల్‌ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని... దానిపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్‌ అందుబాటులో లేరని కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్​పై కలెక్టర్‌కు, జిల్లా మంత్రికి విన్నవించామని... వారు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

వాడివేడిగా జడ్పీ సమావేశం

ఇదీ చదవండి: JURALA: పెద్ద ఎత్తున వరద... 32 గేట్లు ఎత్తి నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.