ETV Bharat / state

వైద్యం వికటించి యువతి మృతి.. బంధువుల ఆందోళన

వైద్యం వికటించి మృతి చెందిన ధీరావత్ సంధ్య మృతదేహంతో టీక్యా తండావాసులు బంధువులు శనివారం సాయంత్రం మిర్యాలగూడలోని సాగర్​ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. నిర్లక్ష్యంగా ఆపరేషన్​ చేసిన వైద్యుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : Jun 22, 2019, 11:10 PM IST

వైద్యం వికటించి యువతి మృతి.. బంధువుల ఆందోళన

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలోని వంశీకృష్ణ ఆస్పత్రిలో ఆపరేషన్ వికటించి నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి ధీరావత్ సంధ్య అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి చెందింది. మిర్యాలగూడ మండలం టీక్యా తండాకు చెందిన ధీరావత్ నిలేశ్వర్ నాయక్ కుమార్తె సంధ్య పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతోంది. బాలిక కొద్ది రోజులుగా గవద బిల్లల సమస్యతో బాధపడుతుండటం వల్ల ఈ నెల 19న పట్టణంలోని డాక్టర్స్ కాలనీ వంశీకృష్ణ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యుడు వంశీకృష్ణ ఆపరేషన్ చేస్తుండగానే మధ్యలో సంధ్య అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆపరేషన్ నిలిపివేసి అత్యవసర వైద్యం కోసం పట్టణంలోని బాలాజీ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్​పై ఉంచి చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోగా 20న హైదరాబాద్​లోని యశోదా ఆసుపత్రికి తరలించారు నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన సంధ్య శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. హైదరాబాద్ నుంచి ఆంబులెన్స్​లో సంధ్య మృతదేహాన్ని తీసుకు రాగా.. సంధ్య బంధువులు సాగర్ రోడ్డుపై​ రాస్తారోకో చేపట్టారు. వంశీకృష్ణ ఆస్పత్రిని సీజ్ చేసి నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసిన వైద్యుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Intro:TG_NLG_82_22_hospatllo_youvathi_death_av_C11

యాంకర్ పార్ట్:

వైద్యం వికటించి మృతి చెందిన ధీరావత్ సంధ్య మృతదేహంతో టీక్యా తండావాసులు బంధువులు శనివారం సాయంత్రం సాగర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ముందుగా మృతదేహాన్ని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించినప్పటికీ తండా యువకులు పెద్ద ఎత్తున హనుమాన్ పేట బైపాస్ రోడ్డు కూడలి వద్ద కు తరలివచ్చారు. భారీ ఎత్తున ర్యాలీ తీశారు.

వాయిస్ ఓవర్:

మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీ లో వంశీ క్రిష్ణ చెవి ముక్కు గొంతు ఆస్పత్రిలో ఆపరేషన్ వికటించి నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి ధీరావత్ సంధ్య 18 సంవత్సరాలు అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి చెందింది. ఘటనకు సంబంధించి విద్యార్థిని కుటుంబ సభ్యులు బంధువులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మిర్యాలగూడ మండలం టీక్య తండకు చెందిన ధీరావత్ నిలేశ్వర్ నాయక్ కుమార్తె సంధ్య పట్టణం లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది బాలిక కొద్దిరోజులుగా ట్రాన్సిల్స్ సమస్యతో బాధపడుతుండటంతో ఈ నెల 19న పట్టణంలోని డాక్టర్స్ కాలనీ వంశీకృష్ణ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యుడు వంశీకృష్ణ ఆపరేషన్ చేయాలి అని చెప్పడంతో 19న ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తుండగానే మధ్యలో సంధ్య అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆపరేషన్ నిలిపివేసి అత్యవసర వైద్యం కోసం పట్టణంలోని బాలాజీ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోగా 20 న హైదరాబాదులోని యశోదా ఆసుపత్రికి తరలించారు నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన సంధ్య శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు తేల్చి చెప్పారు. హైదరాబాద్ నుంచి ఆంబులెన్స్ లో సంధ్య మృతదేహాన్ని తీసుకు రాగా ఆంబులెన్స్ తో సహా రోడ్డుపై బైఠాయించి నీనాదాలు చేశారు సాగర్ రోడ్డు వద్దకు ఇరువైపులా కూర్చుని వాహనాలు అడ్డగించారు వంశీకృష్ణ ఆస్పత్రిని సీజ్ చేసి నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసిన వైద్యుడు పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా లే కార్డులు తయారు చేసి వాటిని పట్టుకుని నీనాదాలు చేశారు. మార్కెట్ చైర్మన్ చిట్టిబాబు నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ తెరాస నాయకులు స్కైలాబ్ నాయక్ రవితేజ నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ర్యాలీని విరమింపజేశారు.

Body:నల్గొండ జిల్లా

Conclusion:మిర్యాలగూడ పట్టణం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.