వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అఖిల్ అలియాస్ చందు... సికింద్రాబాద్ అడ్డుగుట్టలోని హోమ్‌కేర్ సెంటర్లో వార్డు బాయ్‌గా పనిచేసేవాడు. అక్కడ పనిచేస్తూ... ఉద్యోగం కోసం పట్టణానికి వచ్చిన యువతులతో పరిచయాలు పెంచుకుని మొబైల్ నంబర్లు తీసుకునేవాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేమను వ్యక్తపరచి... చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా వారి ఫొటోల్ని సేకరించేవాడు.
''అలా సేకరించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించేవాడు. కొందరిని డబ్బులు ఇవ్వాలని... మరికొందరిని కోరిక తీర్చాలని బలవంత పెట్టేవాడు. సుమారు 200 మంది యువతులు ఇతని ట్రాప్‌లో పడ్డారు. నల్గొండలో ఓ అమ్మాయి షీటీమ్‌ను సంప్రదించడంతో ఇతని బండారం బయటపడింది. ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నా... తప్పించుకుంటూ తిరిగేవాడు.''
-జిల్లా ఎస్పీ, ఎ.వి. రంగనాథ్
ఇవీ చూడండి: ఇదే మొదటిసారి?...ఒకే ఇంట్లో 26 మందికి కరోనా