నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని బంజారానగర్ తండా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కలమంద తండాకు చెందిన కిషన్, రాజు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. దేవరకొండ వైపు వెళ్తున్న అటవీశాఖ అధికారుల వాహనం మూలమలుపు వద్ద అదుపుతప్పి బైక్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కిషన్ అక్కడికక్కడే మృతిచెందగా... రాజుతో పాటు ముగ్గురు అటవీశాఖ సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!