నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి పనులు నిలిపివేశారు. దీనివల్ల పనులు లేక వలస కూలీలు అవస్థలు పడుతున్నారు. గత మూడు నెలల నుంచి వేతనాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తమ దగ్గర డబ్బులు లేక తినడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. ఒక్కొక్క గదిలో 10మంది వరకు ఉంటున్నామని... ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తమను త్వరగా స్వస్థలాలకు పంపేలా చూడాలని వలసకూలీలు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.
ఉండలేం... మా ఊరెళ్తాం - ఉండలేం... మా ఊరెళ్తాం
నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో వలస కూలీలు ఆందోళకు దిగారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 1500మంది కార్మికులు గత 3 రోజులుగా తమను స్వస్థలాలకు పంపించాలని ధర్నా నిర్వహించారు.
నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి పనులు నిలిపివేశారు. దీనివల్ల పనులు లేక వలస కూలీలు అవస్థలు పడుతున్నారు. గత మూడు నెలల నుంచి వేతనాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తమ దగ్గర డబ్బులు లేక తినడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. ఒక్కొక్క గదిలో 10మంది వరకు ఉంటున్నామని... ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తమను త్వరగా స్వస్థలాలకు పంపేలా చూడాలని వలసకూలీలు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.
TAGGED:
ఉండలేం... మా ఊరెళ్తాం