యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావిలో వివాహిత కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన సోనీని నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన వ్యక్తితో నాలుగు నెలల క్రితం వివాహం చేశారు. వారం రోజుల క్రితం నాన్నమ్మ ఇంటికి వచ్చిన సోనీ ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భార్యాభర్తలు మధ్య ఎలాంటి గొడవలు లేవని..ఎందుకు చనిపోయిందో తెలియడం లేదని బంధువులు, గ్రామస్తులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: లావణ్య కస్టడీ కోరుతూ అనిశా పిటిషన్