నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పర్తునాయక్ తండాకు చెందిన కొంతమంది వల్ల తనకు ప్రాణహాని ఉందని కొండ్రపోల్ వీఆర్ఏ విజయ్ మిర్యాలగూడ ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. గురువారం తండాకు చెందిన కొంతమంది తన ఇంటికి వచ్చి వారి భూమికి సంబంధించిన రికార్డులు తారుమారు చేశావంటూ నానా దుర్భాషలాడుతూ బెదిరించారని ఆయన అన్నారు. వాడపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు స్పందించలేదని చెప్పారు.
తమ దగ్గర వీఆర్ఏ విజయ్ భూరికార్డుల విషయమై డబ్బులు వసూలు చేశాడని పర్తు నాయక్ తండాకు చెందిన రైతులు చెబుతున్నారు. ఒకరి పేరు మీద ఉన్న భూముల్ని మరొకరి పేరుకు మార్చి అనేక అవకతవకలు పాల్పడ్డాడని అంటున్నారు. దీనిపై అడిగేందుకు వెళ్లగా జీతం వచ్చిన తర్వాత మీ డబ్బులు ఇస్తానని చెప్పడం వల్ల తిరిగి వచ్చేశామని వారు అంటున్నారు. వీఆర్ఏ అవినీతి బయట పడుతుందని తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు వాపోయారు.
ఇదీ చూడండి : రచ్చబండ వద్ద.. రైతులతో మంత్రి ముఖాముఖి