ETV Bharat / state

పరిహారంకోసం ముంపు గ్రామస్థుల పోరాటం

author img

By

Published : Jun 11, 2019, 8:49 PM IST

ఫ్లోరైడ్‌, కరవు పీడిత ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. పరిహారం పంపిణీలో మాత్రం గ్రామస్థులకు మొండి చేయి చూపడం వల్ల... పనులకు అడ్డంకులు తప్పడం లేదు.

పరిహారంకోసం ముంపు గ్రామస్థుల పోరాటం

నల్లగొండ జిల్లాలో ఫోర్లైడ్​, కరవును నివారించేందుకు... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న జలాశయం పనులలో అడుగడుగునా ఆటంకాలు ఎదరవుతున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా నీటిని లిఫ్ట్‌ చేసి డిండి కాల్వల ద్వారా సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాయినిపల్లి, చర్లగూడెం జలాశయాలను నింపేందుకు ఈ పథకాన్ని చేపడుతున్నారు. ఈ ఐదు జలాశయాలకు నీటిని పంపుతూ మార్గమధ్యలో ఉన్న కుంటలు, చెరువులు నింపుతారు. 3.11లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ పథకం ఉద్దేశం. ఇప్పటికే 90శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే స్పిల్‌వే నిర్మాణం, గేట్లు, కట్ట ఏర్పాటు, రెయిలింగ్‌ పనులు చివరి దశకు చేరాయి.

పరిహారంకోసం ముంపు గ్రామస్థుల పోరాటం

మిగిలిన కొంతభాగం రెయిలింగ్‌ పనులు పెండింగ్‌లో ఉండగానే... లింగన్నబావి ముంపు గ్రామస్థులు తమకు పరిహారం అందించాలని గత రెండు నెలలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. లింగన్నబావి గ్రామంలో 25 ఇళ్లు, పూతలరాంతండాలో 45 నివాసాలు ముంపునకు గురవుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అనంతరం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని సదరు గుత్తేదారు హామీనిచ్చి ఆందోళన విరమింపజేశారు.

ఇటీవల లింగన్నబావి గ్రామస్థులు మరోసారి ఆందోళనకు దిగారు. మల్లన్నసాగర్‌ ప్యాకేజీని ఇక్కడ అమలుపర్చాలని... చింతపల్లి మండలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగిన బాధితులను అరెస్టు చేశారు. అనంతరం సొంతపూచీకత్తుపై వదిలిపెట్టారు. గ్రామస్థులు మాత్రం పరిహారం కోరితే అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:'తప్పుడు ర్యాంకుల కళాశాలలపై డీజీపీకి ఫిర్యాదు'

Intro:TG_NLG_31_11_PROJECT_FORMERS_PROBLEM_PKG_C6 అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ,నల్లగొండ జిల్లా ఫోన్:8008016365 NOTE:సర్ ఈరోజు ఈనాడులో వచ్చిన కథనం,కావున ప్రసారం చేయగలరు.

Body:ఫ్లోరైడ్‌, కరవు పీడిత ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. పరిహారం పంపిణీలో మాత్రం గ్రామస్థులకు మొండి చేయి చూపుతోంది. దీంతో పనులకు అడ్డంకులు తప్పడం లేదు.LOOK.... VOICE OVER: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామం వద్ద విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న జలాశయం పనులలో అడుగడుగునా ఆటంకాలు ఎదరవుతున్నాయి.శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణ నీటిని లిఫ్ట్‌ చేసి డిండి కాల్వల ద్వారా సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాయినిపల్లి, చర్లగూడెం జలాశయాలను నింపేందుకు ఈ పథకాన్ని చేపడుతున్నారు. ఈ ఐదు జలాశయాలకు నీటిని పంపుతూ మార్గమధ్యలో ఉన్న కుంటలు, చెరువులు నింపుతారు. 3.11లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ పథకం ఉద్దేశం. దీంతో కరవు పీడిత ప్రాంతాలు సస్యశ్యామలం కానున్నాయి. ప్రభుత్వం మాత్రం ముంపు గ్రామాలైన లింగన్నబావిలో 25 ఇళ్లు, పూతలరాంతండలో 45 ఇళ్లు ముంపునకు గురవుతున్నా ముంపువాసుల సమస్యలు పరిష్కరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు మల్లన్నసాగర్‌ ప్యాకేజీని అమలుపర్చాలని చింతపల్లి మండలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Conclusion:VOICE OVER 1 : విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా గొట్టిముక్కల జలాశయం పనులు ఇప్పటికే 90శాతం పూర్తయ్యాయి. రూ.127కోట్లతో ఈ జలాశయాన్ని 2017లో 1.76 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్పిల్‌వే నిర్మాణం, గేట్లు, కట్ట ఏర్పాటు, రెయిలింగ్‌ పనులు చివరి దశకు చేరాయి. మిగిలిన కొంతభాగం రెయిలింగ్‌ పనులు పెండింగ్‌లో ఉండగానే లింగన్నబావి ముంపు గ్రామస్థులు తమకు పరిహారం అందించాలని గత రెండు నెలలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏప్రిల్‌ మాసంలో ఎన్నికల కోడ్‌ అనంతరం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని సదరు గుత్తేదారు హామీనిచ్చి ఆందోళన విరమింపజేశారు. ఇటీవల లింగన్నబావి గ్రామస్థులు పనులు నిలిపివేసేందుకు ఆందోళనకు దిగారు. దీంతో పనులకు ఆటంకం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. గ్రామస్థులు మాత్రం పరిహారం కోరితే అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. VOICE OVER 2 : బైట్స్: 1) జీవన్ రెడ్డి ( బాధిత రైతు,గొట్టిముక్కల గ్రామం,దేవరకొండ మండలం,నల్లగొండ జిల్లా ) 2) బుజ్జమ్మ( బాధిత మహిళ రైతు,గొట్టిముక్కల గ్రామం,దేవరకొండ మండలం,నల్లగొండ జిల్లా ) 3) నర్సిరెడ్డి ( బాధిత రైతు,గొట్టిముక్కల గ్రామం,దేవరకొండ మండలం,నల్లగొండ జిల్లా ) 4) లక్ష్మి ( బాధిత మహిళ రైతు,గొట్టిముక్కల గ్రామం,దేవరకొండ మండలం,నల్లగొండ జిల్లా )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.