నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ది ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. అనంతరం తెలుగుపల్లి గ్రామంలో 10వేల మంది జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తనను ఎంపీగా గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. హుజూర్‌నగర్‌లో ఏప్రిల్ 1న జరగబోయే బహిరంగ సభకు రాహుల్ వస్తున్నారని, అందరూ హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. పేద ప్రజల కోసం సంవత్సరానికి 72 వేల చొప్పున కనీస ఆదాయ పథకానికి శ్రీకారం చుడుతున్న రాహుల్‌ను ప్రధానిగా చూడడం కోసం పాటుపడాలని నిర్దేశించారు.
ఇవీ చూడండి:ఎన్నికల తర్వాత కాంగ్రెస్, భాజపాలు ప్రాంతీయ పార్టీలే