పోలింగ్తేదీ సమీపించే కొద్ది అభ్యర్థులు ప్రచార వేగం పెంచారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. తనని గెలిపిస్తే గిరిజనుల తరఫున పోరాడి రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
తెరాస సగం స్థానాల్లో కూడా గెలవదు
ఎంపీపీగా ఓడిపోయిన తెరాస అభ్యర్థి నర్సింహారెడ్డి ఎంపీగా ఎలా గెలుస్తారని ఎద్దేవా చేశారు. తెరాస పార్టీ కనీసం 8స్థానాల్లో కూడా గెలవదన్నారు. హస్తం గుర్తుపై ఓటేసి తనని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ బాలు నాయక్, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మహిళల నృత్యాలతో హోరెత్తిన కోమటిరెడ్డి ప్రచారం