ETV Bharat / state

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఉత్తమ్​.. ఏమన్నారంటే..?

Uttam Latest Comments: ఎనిమిదిన్నరేళ్లలో చేయలేని అభివృద్ధి భాజపా, తెరాసలు మునుగోడును ఇప్పుడెలా చేస్తాయని కాంగ్రెస్‌ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రెండు పార్టీలో ఎంతో ప్రలోభపెట్టినా.. జనం కాంగ్రెస్‌ వైపు ఉన్నారన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంశంపై తాను స్పందించబోనన్న.. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు.

MP Uttam Kumar Reddy
MP Uttam Kumar Reddy
author img

By

Published : Oct 22, 2022, 4:55 PM IST

Updated : Oct 22, 2022, 6:24 PM IST

ఎనిమిదిన్నరేళ్లలో చేయలేని అభివృద్ధి ఇప్పుడేం చేస్తారు: ఉత్తమ్‌కుమార్​రెడ్డి

Uttam Latest Comments: మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్​రెడ్డి స్పష్టం చేశారు. ఎవరేం మాట్లాడినా మునుగోడు ఓటర్లు పట్టించుకోరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తానేమి మాట్లాడనని పేర్కొన్నారు. ఎనిమిదిన్నరేళ్లలో చేయలేని అభివృద్ధి భాజపా, తెరాసలు మునుగోడును ఇప్పుడెలా చేస్తాయని కాంగ్రెస్‌ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యవహారం గురించి పార్టీ ఇంచార్జీ ఏఐసీసీ నేతలు మాట్లాడుతారని తెలిపారు. డొర్నకల్‌ మిర్యాలగూడ మధ్యలో కొత్త రైల్వే లైన్ మంజూరయిందని వెల్లడించారు. హుజుర్‌నగర్‌, కోదాడ మీదుగా వెళ్లే ఈ లైన్‌ 93కిలోమీటర్లు ఉంటుందని ఇందుకోసం 1294కోట్లు ఖర్చు అవుతుందని ఉత్తమ్‌కుమార్​రెడ్డి వివరించారు. మెరుగైన రవాణా సౌకర్యం ఉంటే ఆ ప్రాంతం అభివృద్ది చెందుతుందన్నారు.

మునుగోడులో పాల్వాయి స్రవంతి భారీ మెజార్టీతో గెలుస్తారు. ఎనిమిదిన్నరేళ్లుగా కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యవహారం గురించి పార్టీ ఇంచార్జీ ఏఐసీసీ నేతలు మాట్లాడుతారని స్పష్టం చేశారు. -ఉత్తమ్‌కుమార్​రెడ్డి నల్గొండ ఎంపీ

ఇవీ చదవండి:

Last Updated : Oct 22, 2022, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.