జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు సాగర్ ఉపఎన్నికల్లో తేదేపా పోటీ చేస్తుందని తేదేపా జిల్లా అధ్యక్షుడు జీవీజీ నాయుడు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియాలో తేదేపా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశంపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
అసలు నాగార్జునసాగర్‌లో ఓట్లు అడిగే హక్కు ఒక్క తేదేపాకే ఉందని.. ఇప్పడున్న నాయకులందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారేనని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు అందరూ సమన్వయంతో పని చేసి.. సాగర్‌లో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తేదేపా జిల్లా అధ్యక్షుడు జీవీజీ నాయుడు, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇంఛార్జి మువ్వ అరుణ్ కుమార్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వ్యాక్సిన్ ఆవిష్కరణకు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని పిల్