ETV Bharat / state

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్

సాగర్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీ తరఫున.. సీఎం కేసీఆర్​ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. నల్గొండ జిల్లా అనుములలో ఈనెల 14న కేసీఆర్ పాల్గొనబోయే సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయా పనులను పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు.

kcr Anumula public meeting
అనుముల బహిరంగ సభ
author img

By

Published : Apr 12, 2021, 8:59 PM IST

సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నల్గొండ జిల్లా అనుములలో సీఎం కేసీఆర్​ నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 14న నిర్వహించనున్న కార్యక్రమానికి.. తెరాస శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఏర్పాట్ల గురించి నాయకులను అడిగి తెలుసుకున్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​తో పాటు ఎంపీలు.. బడుగుల లింగయ్య, బండ ప్రకాశ్​, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్​, తదితరులు... పనులను పర్యవేక్షించారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.