ETV Bharat / state

మునుగోడులో జోరందుకున్న ప్రచారం.. ప్రజాక్షేత్రంలో పాగా వేసిన గులాబీదళం - munugode latest news

TRS Munugode Bypoll Campaign: రాష్ట్ర రాజకీయానికి మునుగోడు వేదికైంది. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ నేతలు ఊరూరా రంగంలోకి దిగారు. అధికార తెరాస ముఖ్య నేతలంతా గ్రామాల్లోనే మకాం వేసి గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. పోలింగ్‌ గడువు మరో పక్షం రోజులే మిగిలి ఉండటంతో.. జోరుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Trs leaders participated in munugode by election campaign

author img

By

Published : Oct 14, 2022, 6:30 PM IST

మునుగోడులో ఉపఎన్నికల ప్రచారం.. ప్రజాక్షేత్రంలో పాగా వేసిన గులాబీ నాయకులు

TRS Munugode Bypoll Campaign: మునుగోడు ఉపఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. కార్యక్షేత్రంలో జోరు మీదున్న అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. ఇతర ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలంతా మునుగోడులోనే బస చేస్తూ ఊరూరా తిరిగి తెరాసకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మునుగోడులో కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.

ఉపఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే గ్యాస్, ఇంధన ధరలు పెంచడాన్ని మనం అంగీకరించినట్లువుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండలం చల్లవాని కుంటలో ఆమె ఓటర్లను కలిసి కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. నాంపల్లి మండలం రాజ్య తండాలో మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, రైతుబంధు ఇస్తున్న కేసీఆర్‌కు మద్దతు ఇవ్వాలని మాలోతు కవిత కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం భాజపాలోకి వెళ్లారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ప్రచారం నిర్వహించిన మంత్రి.. కాంగ్రెస్, భాజపాలకు మునుగోడు ఉపఎన్నికల్లో డిపాజిట్ రాదని తేల్చిచెప్పారు. రాజగోపాల్ రెడ్డి చొరవ తీసుకుని కేంద్రం నుంచి రూ.2 వందల కోట్ల నిధులు విడుదల చేయించాలని మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు.

సంస్థాన్‌ నారాయణపురం మండలం చిమిర్యాలలో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని గెలిపించాలంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రచారంలో పాల్గొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి: మునుగోడు ఉప ఎన్నిక.. దత్తత నీదా-నాదా 'సై' అంటున్న ప్రధాన పార్టీలు

ముగిసిన నామినేషన్ల పర్వం.. చివరిరోజు అట్టహాసంగా పాల్వాయి స్రవంతి నామినేషన్

పేల్చే పటాకులు కాదు. తినే టపాసులు ఇవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.