ETV Bharat / state

ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు

రాష్ట్రంలో ఏప్రిల్ 17న జరగనున్న నాగార్జునసాగర్​ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రచార జోరు పెంచారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలు ఇంఛార్జ్​లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​లు ప్రచారంలో పాల్గొన్నారు.

trs Leaders involved in the nagarjuna sagar by election campaign
ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు
author img

By

Published : Mar 19, 2021, 3:12 PM IST

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో అధికార తెరాస పార్టీ నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచార ఇంఛార్జ్​​లు మండల ప్రజలను కలుస్తూ సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. పెద్దవూర మండలం ఇంఛార్జ్​గా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా కుంకుడు చెట్టు తండా, నిమా నాయక్ తండా ప్రజలతో సమావేశమయ్యారు.

తిరుమల మండలంలో ఉన్న డీ8, డీ9 కాల్వలను ఆ మండల ఇంఛార్జ్​లు దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పరిశీలించి.. రైతులతో కలిసి ప్రచారం చేశారు.

హాలియా పురపాలక సంఘం ఐదోవార్డులోని ప్రజలతో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. వచ్చే సాగర్ ఉప ఎన్నికలో తెరాస పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. సాగర్​ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : 36 మంది అభ్యర్థులు ఎలిమినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.