నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య జెండా ఊపి ప్రాంభించారు. ఈరోజు 40 మంది ప్రయాణికులతో సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ బయల్దేరింది. ప్రతి బుధవారం, శనివారం లాంచీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ టూరిజం అధికారులు స్పష్టం చేశారు. లాంచీలో వెళ్లి రావడానికి పెద్దలకు రూ.2200, పిల్లలకు రూ.1760 టికెట్ ధరలు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను కూడా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. వాటికి ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. పర్యాటకులకు భోజనం, వసతి సదుపాయాలు కూడా పర్యాటక శాఖ వారే ఏర్పాటు చేయనున్నారు.
ఇదీ చూడండి: చంద్రయాన్-2: 'ల్యాండర్ కష్టమే- ఆర్బిటర్ భద్రం'