ETV Bharat / state

'విద్య, వ్యక్తిత్వ వికాస విలువలు అలవర్చుకోవాలి'

author img

By

Published : Mar 22, 2021, 7:24 PM IST

నల్గొండ జిల్లా నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో 'కెరీర్ గైడెన్స్' అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు ప్రముఖ సైకాలజిస్ట్ పోలె సైదులు సూచించారు. శిక్షణ కార్యక్రమం జైహింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

జైహింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాశాలలో కెరీర్ గైడెన్స్ శిక్షణ

విద్యార్థులు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రముఖ సైకాలజిస్ట్ పోలె సైదులు పేర్కొన్నారు. పాఠ్యాంశాలపై ముందు నుంచే అవగాహన పెంచుకొని సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. జైహింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో 'కెరీర్ గైడెన్స్' అంశంపై శిక్షణ ఇచ్చారు.

విద్యతో పాటు వ్యక్తిత్వ వికాస విలువలు విద్యార్థులు పెంపొందించుకోవాలని.. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని సైదులు అన్నారు. తాత్కాలిక ఆకర్షణలకు లోనుకాకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సన్మార్గంలో ప్రయాణించాలని సూచించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నాంపల్లి ఎస్సై రఫీ, కళాశాల ప్రిన్సిపల్ గంధం మోహన్​రావు, అధ్యాపకులు వెంకన్న, రజినీకాంత్, శ్రీనివాస్, సంపత్, శిరీష, స్వామి వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి శ్రీహరి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పాఠశాల విద్యార్థులకు సెలవులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.