ETV Bharat / state

ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. డబ్బును ఆదా చేసుకోండి - ట్రాఫిక్ రూల్స్ పాటించండి..

"డబ్బులు ఎవరికి ఊరికే రావు... ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, మీ డబ్బును ఆదా చేసుకోండంటూ..." నల్గొండ జిల్లా పోలీసులు  వినూత్న ప్రచారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన రవాణా చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. డబ్బును ఆదా చేసుకోండి.
author img

By

Published : Aug 25, 2019, 3:25 PM IST

రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన రవాణా చట్టాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేసేందుకు నల్గొండ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి అనవసరంగా డబ్బులు వృథా చేసుకోవద్దంటూ మిర్యాలగూడ పట్టణంలో తమదైన శైలిలో ప్రచారం సాగిస్తూ వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత నెల రోజులుగా తరచూ వాహన తనిఖీలు చేపడుతున్నారు. పోలీసుల సలహా పేరుతో "నిబంధనలు పాటించండి.. డబ్బులు ఆదా చేసుకోండి" అంటూ పలు సూచనలతో అన్ని ప్రధాన కూడలిలో పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. మైకుల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా నూతన చట్టంపై ముమ్మర ప్రచారం చేపట్టారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. డబ్బును ఆదా చేసుకోండి.

ఇవీ చూడండి: విశ్రాంత శాస్త్రవేత్త ఇంట... సేంద్రియ పంట

Intro:TG_NLG_82_24_traffic_Nibhandhanalu_Nuthana_chattam_PkG_TS10063

contribhutor: K.Gokari
center :Nalgonda (miryalaguda)
()

డబ్బులు ఎవరికి ఊరికే రావు...... ట్రాఫిక్ నిబంధనలు పాటించి జరిమానాల పేరుతో డబ్బులు నష్ట పోతుండగా చూసుకోవాలా అంటూ జిల్లా పోలీసులు వినుత ప్రచారం ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన రవాణా చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమలు చేసేందుకు రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు భారీ నిర్మాణాలతో చెక్ పెట్టవచ్చునని ఉద్దేశంతో ప్రభుత్వం చేసిన నూతన చట్టం అమలు చేసేందుకు జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టి తమదైన శైలిలో ప్రచారం సాగిస్తూ వాహనచోదకులు లో అవగాహన కల్పించేలా కృషి చేస్తున్నారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గతంలో మాదిరిగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వందో 200 జరిమానా కట్టించుకునే పద్ధతికి కాలం చెల్లుతుంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల జేబులకు చిల్లులు పడే సమయం ఇంకెంత దూరం లేదు ప్రజలు రహదారి భద్రత లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతన సవరణ చట్టాన్ని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేసేందుకు సమాయత్తమవు తుంది . నూతన చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు భారీగా విధించనున్నారు. ముఖ్యంగా అనేక క మద్యం తాగి వాహనాలు నడిపే కేసుల్లో రూ 10000 లు వరకు జరిమానా విధించడం ఉన్నారు. దీంతో తో పాటు మైనర్లు వాహనాలు నడిపితే వాహనాన్ని జప్తు చేయడం తో పాటు తల్లిదండ్రులకు శిక్షలు అమలు చేయనున్నారు హెల్మెట్ సీటు బెల్టు ధరించకపోయినా సరైన ధ్రువ పత్రాలు లేకపోయినా వాహనానికి బీమా చేయించక పోయినా భారీగా నిర్మాణాలు విధించనున్నారు.....

ముమ్మర ప్రచారం.......

నూతన చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పట్టణ పోలీసులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత నెల రోజులుగా తరచు వాహన తనిఖీలు చేపడుతూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీసు వారి సలహా పేరుతో నిబంధనలు పాటించండి. డబ్బు ఆదా చేసుకోండి అంటూ పలు సూచనలతో అన్ని ప్రధాన కూడలిలో పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేస్తూ విస్తృత ప్రచారం ప్రారంభించారు. దీనికి తోడు మైకుల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా నూతన చట్టం పై ముమ్మర ప్రచారం చేపట్టారు.

ఇప్పటికే ప్రారంభమైన ఈ చలాన్...........

పట్టణంలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఇప్పటికే ఈ చలాన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా సిబ్బంది తమ చరవాణి ద్వారా నిబంధనలు అతిక్రమించే వాహనదారులను ఫోటోలు బంధిస్తూ నేరుగా ఇంటికే పంపిస్తారు. వాహన యజమానులు మీ-సేవ కేంద్రాల్లో కానీ పోలీసు వారు సూచించిన ఇతర పద్ధతుల ద్వారా కానీ చెల్లించాలి. దీని నుంచి తప్పించుకునేందుకు అప్పుడే వాహనదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. అంటూ పోలీసు వారు చెప్తున్నారు. సంఖ్య ఫలకం లో ఏదో ఒక అంకె కనపడకుండా చేయడం ద్వారా ఈ చలాన్ నుంచి తప్పించుకోవచ్చు అనే భావనలో ఉన్నారు. అయితే ఇటువంటి వారిని వదిలిపెట్టేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రధాన నిబంధనలు జరిమానాలు...........

సెల్ఫోన్ డ్రైవింగ్ రూ. 5 వేలు
మద్యం తాగి వాహనం నడిపితే రూ. 10, వేలు
హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవింగ్ రూ. వెయ్యి
ఇన్సూరెన్స్ లేకపోతే రూ.రెండు వేలు
మైనర్లు వాహనం నడిపితే రూ. 5 వేలు
ఇలా అన్ని రకాల నిబంధనల ఉల్లంఘనలకు భారీగా జరిమానాలు పెంచారు.

బైట్స్..........

1) ట్రాఫిక్ ఇన్చార్జి సీఐ శ్రీనివాస్ రెడ్డి.
2) వాహనదారుడు టి.సైదులు.

Body:నల్గొండ జిల్లా

Conclusion:మిర్యాలగూడ పట్టణం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.