ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని... టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ సాగర్ నియోజకవర్గానికి వస్తుంటే కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై నల్గొండ జిల్లా రిటర్నింగ్ అధికారి, ఎస్పీతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలను అరెస్టు చేయిస్తున్నారని విమర్శించారు. అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని... లేకపోతే హాలియాలో ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ నేతలను అరెస్ట్ చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాడ్ చేశారు.
ఇదీ చదవండి: 'కోర్టు ధిక్కరణ అప్పీళ్లలో ఆ వివరాలు తప్పనిసరి'