చెంచుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ... పర్యావరణానికి ముప్పుగా పరిణమించనున్న యురేనియం తవ్వకాలను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అమరాబాద్, నాగార్జున సాగర్, లాంబాపూర్ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం... తవ్వకాలకు అనుమతులు ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. మన్ననూరు, పదర, దేవరకొండ ప్రాంతాల్లో 283 హెక్టార్లలో, నాగార్జున సాగర్‌లోని లంబాపూర్‌లో 542 హెక్టార్లలో మొత్తం 18,500 టన్నుల యురేనియం వెలికి తీయాలని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సన్నాహాలు చేస్తున్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. తక్షణమే యురేనియం తవ్వకాలకు సంబంధించిన అనుమతులను రద్దు చేసి ఆయా ప్రాంతాల్లో నివసించే అటవీ జాతులను, పర్యావరణాన్ని కాపాడాలని ముఖ్యమంత్రిని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు.
ఇదీ చూడండి: కొత్త "రెవెన్యూ" చట్టంతో కీలక మార్పులు