సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 16, 17 వార్డుల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కౌన్సిల్ అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వార్డులకు కావాల్సిన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కొద్దిసేపు కార్యకర్తలతో ఉత్తమ్ ముచ్చటించారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు పుర ఎన్నికలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
ఇవీచూడండి: సిరిసిల్లలో నేను చేయాల్సిన పని ఇదే: కేటీఆర్