నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గపరిధిలోని కొత్తలూరు, ముక్కముల గ్రామాల్లోని పొలాల్లో బత్తాయి తోటల్లో పులి అడుగుల గుర్తులు స్థానికులను భయపెడుతున్నాయి. పులి తిరుగుతోందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తలూరులో చిరుత పాద ముద్రలు చూసి... స్థానికులు వెంటనే అటవీశాఖకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అటవీ సిబ్బంది చిరుత జాడను కనుగొనే పనిలో పడ్డారు. పాద ముద్రలు పరిశీలించిన అధికారులు హైనా అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: కలెక్టర్లకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన బాధ్యతలు ఇవే!