ETV Bharat / state

గతితప్పుతున్న ప్రయాణం... ఎంతోమంది జీవితాల్లో విషాదం! - latest road accidents in telangana

సంతోషంగా సాగిపోతున్న జీవితం. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు సంతానం. ఆ అన్యోన్యతను చూసి ఆ దేవుడికి అసూయ పుట్టినట్టుంది! ఆ కుటుంబంలో కొలుకోలేని విషాదాన్ని మిగిల్చాడు. అందరూ ఆనందంగా వస్తుంటే.. నీటి రూపంలో మృత్యులు వారిని కబళించింది. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో కారు పడి ముగ్గురు మృతిచెందడం అందరినీ కలచివేస్తోంది. అవిభాజ్య నల్గొండ జిల్లాలో ఇలా కాల్వల్లో పడి మృతిచెందిన ఘటనలెన్నో!

car fall in canal
కాల్వలోకి దూసుకెళ్లిన కారు
author img

By

Published : Feb 27, 2020, 4:40 PM IST

కాల్వలోకి దూసుకెళ్లిన కారు

కాల్వలు, చెరువులపైన గల అప్రోచ్ కాల్వల వద్ద రక్షణ గోడలు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్రోచ్ దారులే దిక్కవడం వల్ల వాటిపైనే ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడాల్సి వస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇలాంటి దారుణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. నల్గొండ జిల్లా పెద్దఆడిశర్లపల్లి మండలం దుగ్యాల వద్ద... ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాల్వలో కారు పడి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో ఒకరిని స్థానికులు రక్షించగలిగారు. కాల్వ అప్రోచ్ దారిలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

అదుపుతప్పి కాల్వలోకి...

ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో, దంపతులతోపాటు కుమార్తె ప్రాణాలు కోల్పోగా... కుమారుడు క్షేమంగా బయటపడ్డాడు. పీఏపల్లి మండలం ఒడ్డెరగూడెం గ్రామానికి చెందిన ఓర్సు రంగయ్య కుటుంబం... కొన్నేళ్లుగా హైదరాబాద్​లో ఉంటోంది. బతుకుదెరువు కోసం పట్నం బాట పట్టిన ఈ కుటుంబం... రెండురోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఉదయం కాల్వపైన అప్రోచ్ దారిలో ప్రయాణిస్తున్న సమయంలో అదుపు తప్పి వాహనం కాల్వలోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి వాహనంలోని వ్యక్తిని కాపాడ గలిగారు.

ఇప్పటి వరకూ ఎంతమంది చనిపోయారంటే...

వారం వ్యవధిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. రామన్నపేట మండలం వెల్లంకి సమీప చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఈ నెల 21న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా అదే రీతిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. 2018లోనూ రెండు భారీ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్​లో పీఏపల్లి మండలం పడమటితండా వద్ద ఏఎమ్మార్పీ కాల్వలో ట్రాక్టర్ పడిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కూలికి వెళ్తున్న సమయంలో ఆ ప్రమాదం సంభవించింది. 2018 జూన్​లోనే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ వద్ద కాల్వలో ట్రాక్టరు పడింది. గ్రామ సమీపంలోని నల్ల చెరువు కాల్వ కట్ట వద్ద చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 15 మంది కూలీలు చనిపోయారు.

అప్రోచ్ రోడ్లు తప్ప మరో దారి లేకపోవడం... చాలా చోట్ల రక్షణ గోడలు కానీ, కంచె కానీ ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు తలెత్తుతున్నాయి.

ఇవీ చూడండి: ఇదీ చూడండి: మానవ హక్కుల కమిషన్​లో బాలల హక్కుల సంఘం ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.