Road accident: నల్గొండ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం లింగోటం సమీపంలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి రెండు కాళ్లు విరిగిపోయాయి.
ఏపీలోని లింగోటం సమీపంలో జాతీయ రహదారిపై మరమ్మతుల కోసం ఆగి ఉన్న లారీని భద్రాచలం డిపోకి చెందిన ఆర్టీసి బస్సు బలంగా ఢీకొట్టింది. భద్రాచలం డిపో ఆర్టీసీ బస్సు 45 మంది ప్రయాణికులతో హైదరాబాదుకు బయలుదేరింది. నార్కట్ పల్లి శివారులోకి చేరుకోగానే ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇవీ చూడండి: Car accident: అమెరికా వెళ్లాల్సిన యువకుడు.. అనంత లోకాలకు..