రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. సమ్మెలో భాగంగా రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలకు కార్మిక నాయకులు వినతిపత్రం ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో నల్గొండ జడ్పీ కార్యాలయం వద్ద పోలీసులు కార్మిక నాయకులను అడ్డుకున్నారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఇదీ చూడండి : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిచ్చగాడి విరాళం