నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీపీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, అమలు తీరుపై చర్చించారు. ఈ పథకాలు ప్రజలందరికీ అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.
నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాన్నికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి విజవాడకు వెళ్లడానికి చిట్యాల, సూర్యాపేట మీదుగా బుల్లెట్ రైలు కానీ, శతాబ్ది లాంటి రైల్వే లైన్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ రైల్వే లైన్ ప్రతిపాదనను రైల్వే శాఖ మంత్రిని కలిసి వివరించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ విషయంపై ప్రధానిని కూడా కలవనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: 'ప్లాస్టిక్ రహిత జాతరగా తెలంగాణ కుంభమేళా'