నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ సీనియర్ నేత గట్టి కొప్పుల రామ్ రెడ్డి అంతిమ యాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. గట్టి కొప్పుల రాంరెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో పాల్గొన్నారని... తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన కృషి మరువలేనిదని కొనియడారు. ఆయన ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇవీచూడండి: విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్