నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం సుంకిశాల తండావాసులు నాగార్జునసాగర్ ఉప ఎన్నికను బహిష్కరింస్తామని హెచ్చరించారు. నాగార్జునసాగర్‌లో ముంపునకు గురైన సుంకిశాలతండా ప్రజల భూములకు గత 60 సంవత్సరాల నుంచి సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని గ్రామ సర్పంచ్ తెలిపారు.
ఉన్న భూములకు పట్టాలు లేక.. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నోముల నర్సింహయ్య సుంకిశాల తండాకు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పడు.. తండాకు నీరు లిఫ్ట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఆ లిఫ్ట్ విషయం ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే ఉపఎన్నిక బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కొనసాగుతున్న ఉత్కంఠ... మేయరా.. ప్రత్యేక కమిషనరా?