నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మన్నెం వెంకన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. చిట్యాల పోలీసులు తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని.. అది కొట్టేయకుంటే దూకేస్తానని బెదిరించాడు. టవర్ చివరివరకు ఎక్కి ఎంతసేపైనా దిగకపోవడం వల్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దింపేందుకు యత్నించారు. బాధితుని బంధువులు సెల్‌టవర్ దిగమని వెంకన్నను ప్రాధేయపడుతున్నారు.
ఇదీ చదవండిః లైవ్ వీడియో: టిప్పర్- బైక్ ఢీ... ఇద్దరు మృతి